– గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ఆఫ్రికా ప్రొఫెసర్ యశోద కృష్ణ
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
ఔషధ పునర్వినియోగం అనేది ఆమోదం పొందిన లేదా పరిశోధనాత్మక ఔషధాల కోసం కొత్త ఉపయోగాలను గుర్తించే ప్రక్రియ అని , నూతన ఔషధాలను కనుగొనే ప్రక్రియతో పోలిస్తే ఇది తక్కువ సమయం , ఖర్చుతో కూడుకున్నదని నెర్జోబీ ( కెన్యా ) లోని యునెటైడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ యశోద కృష్ణ జనపతి పేర్కొన్నారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘ ఔషధ పునర్వినియోగం : ఒక వ్యూహాత్మక విధానం ‘ అనే అంశంపై సోమవారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు . కొత్త ఔషధాల ఆవిష్కరణ , ఇప్పటికే ఉన్న ఔషధాల వినియోగానికి సంబంధించిన కీలక అంశాలపై ఆయన లోతైన అవగాహనను ఏర్పరచారు . కరోనా వంటి కొత్త అంటువ్యాధుల వ్యాప్తి నిరోధానికి కొత్త ఔషధాల ఆవిష్కరణకు , చాలా తక్కువ సమయంలో తగిన చికిత్సా విధానాలు , ఔషధ చికిత్సలను ఎంచుకోవడానికి ఆరోగ్య నిపుణుల ముందు ప్రత్యేకమైన సవాళ్లున్నాయని డాక్టర్ యశోద కృష్ణ పేర్కొన్నారు . ఇటువంటి స్థితిలో ఔషధ పునర్వినియోగం వల్ల గణనీయమైన పరిశోధనా సమయంతో పాటు వ్యయాన్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు . ఔషధ పునర్మిర్మాణ ప్రయత్నాలు నిర్దిష్ట వ్యాధి లక్ష్యంతో పాటు ఔషధం బహుళ ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయన వివరించారు . తొలుత , ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్ . కుమార్ అతిథిని పరిచయం చేసి , సత్కరించారు . ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొని , తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు .
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…