Hyderabad

డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయ వాది

మియపూర్

డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయ వాది అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ x రోడ్, మియపూర్ బిజెపి కార్యాలయం వద్ద జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ డా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమంలో ఆయన చిత్ర పట్టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం కార్యాలయం వద్ద చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ నిష్ణాతుడైన న్యాయవాది, తత్వవేత్త, గొప్ప పేరున్న విద్యావేత్త అని అన్నారు.అతను కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క అతి పిన్న వయస్కుడైన ఛాన్సలర్ గా ,స్వతంత్ర భారతదేశపు మొదటి పరిశ్రమ మరియు సరఫరా మంత్రిగా దేశానికి సేవ చేశాడు గుర్తుచేశారు.జాతీయ ఐక్యతను కాపాడటానికి , జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో పూర్తిగా ఏకీకృతం చేయడానికి అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప దేశభక్తుడు అని అన్నారు. మాతృభూమిపై ఆయనకున్న ప్రేమ ప్రతి భారతీయుడికి ఎప్పుడూ ప్రేరణగా ఉంటుందన్నారు.

కాశ్మీర్ విషయంలో ఆయన కన్న కలల్ని ఇవాళ భారత ప్రధాని మోదీ నిజం చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులర్పించారు.తదనంతరం జాతీయ పార్టీ పిలుపు మేరకు చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా జన ప్రియ నగర్, హఫీజ్ పెట్, ప్రజసిటీ,ఆల్విన్ కాలనీ, సప్తగిరి కాలనీ మరియు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కోటేశ్వరరావు,వర ప్రసాద్, శ్రీనివాస్ యాదవ్, ఆకుల లక్ష్మణ్, పాపయ్య,రాజా రత్నం,పృథ్వి కాంత్, బాబు, అంజయ్య,యాదగిరి,నర్సింహ,జానీ,శ్రీకర్, లక్ష్మ రెడ్డి, రమణరావు, రవీందర్, కొండ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago