Districts

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాలు నేటి తరానికి దిక్సూచి: సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్

మనవార్తలు , పటాన్ చెరు:

భారత రాజ్యాంగ నిర్మాత, అభ్యుదయవాది, అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి అనుసరణీయమని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకొని రుద్రారం గ్రామం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సాబాదా సాయి కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా స్వాతంత్రం అనంతరం దేశంలో అత్యధిక శాతం కలిగిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను పొందుపరిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆరాధ్య దైవంగా అంబేద్కర్ మారారని అన్నారు.అంబేద్కర్ అంటే ఒక వర్గానికి పరిమితం కాదని, అన్ని వర్గాలకు స్ఫూర్తి ప్రదాత  అని బడుగు, బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేడ్కర్.వారి అభ్యున్నతకి రాజ్యాంగంలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.

దేశ పురోగతికి మార్గదర్శనం చేసిన మహనీయుడుని స్మరించుకుంటూ జై భీమ్ నినాదాలు మారుమోగాయి. అంటరానితనం, సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి కుల, మత, వర్ణ, వర్గ రహిత సమాజం కోసం అహర్ణిశలు కృషి చేసిన మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాంగాన్ని క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమానికి అన్నదానం మరియు అంబేద్కర్ శోభయాత్ర కు గాని మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్ గారికి అంబేద్కర్ యువజన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎమ్అర్ పిఎస్ ,ఎమ్ఇఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ ముక్క గళ్ళ ఆంజనేయులు ,బీఎస్పీ సెక్టార్ ఇంచార్జి సాబాదా శ్రీనివాస్,రాష్ట్రీయ దళిత సేన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్,సంఘం అధ్యక్షులు, మహేష్ మాజీ వార్డు మెంబర్ పోట్లచెరువు ప్రభు ఎర్రోళ్ల ప్రభు, పెద్దబోదుల నర్సింలు, గడ్డమీది కుమార్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago