Telangana

వైద్యులే నిజమైన హీరోలు : నిధి అగర్వాల్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :

క్వాంబియంట్ డెవలపర్స్ గ్లోబల్ టైటిల్ స్పాన్సర్‌గా, ఎవర్‌నార్త్ హెల్త్ సర్వీసెస్ పవర్డ్ బై భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్–2026 తొమ్మిదో ఎడిషన్‌ను శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని హోటల్ దస్పల్లాలో ఘనంగా ప్రకటించారు.ఈ ఏడాది అక్టోబర్ 11, 2026 (ఆదివారం) గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ మరియు ఫిజికల్ రూపాల్లో ఈ కార్యక్రమం జరుగుతుండగా, హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రముఖ నటి నిధి అగర్వాల్ అధికారిక టీ-షర్ట్ మరియు ఫినిషర్స్ మెడల్ను ఆవిష్కరించి ఈ ఏడాది క్యాన్సర్‌పై ప్రపంచవ్యాప్త అవగాహన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “వైద్యులే నిజమైన హీరోలు. నేను సాధారణంగా హాజరయ్యే కార్యక్రమాల్లో ఇది ఒకటి కాదు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అద్భుతమైన సేవలు అందిస్తోంది. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందస్తు నివారణ ఎంతో మంచిది. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి” అని పిలుపునిచ్చారు.అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోంది. మన శరీరం చెప్పే సంకేతాలను వినాలి. మన శరీరమే గొప్ప పరిశోధనా కేంద్రం. ఆరోగ్యకరమైన శరీరం ఉంటే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకుని ఆనందంగా జీవించాలి. చాలా వ్యాధులకు ఒత్తిడే ప్రధాన కారణం. అందుకే నా వాట్సాప్ డీపీపై ‘హ్యాపీ మైండ్  హ్యాపీ లైఫ్’ అని పెట్టుకున్నాను” అన్నారు.ఈ సందర్భంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ త్వరలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా కానుందని ఆయన ప్రకటించారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

41 minutes ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

1 hour ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

7 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

19 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

19 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

20 hours ago