Telangana

పటాన్చెరులో ఘనంగా జిల్లా స్థాయి 67వ ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభం

_విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సంగారెడ్డి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన విద్యార్థులతో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ను స్వీకరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ప్రభుత్వం ప్రతి ఏటా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచేలా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానాన్ని 7 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ఐదు ఎకరాల విస్తీర్ణంతో వివిధ మండలాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు.

వివిధ క్రీడ అంశాల్లో ప్రతిభ చూపుతున్న క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థి దశనుండే క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రుల సైతం సంపూర్ణ ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి, లలితా సోమిరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ అమూల్య, సీఐ లాలూ నాయక్, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago