Telangana

ప‌టాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ

_పల్లె నుండి పట్నం వరకు స్వతంత్ర స్ఫూర్తితో ప్రారంభమైన స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల ద్విసప్తాహ సంబరాలు

_విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా వీక్షించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

ప‌టాన్ చెరు/అమీన్పూర్/రామచంద్రాపురం/జిన్నారం/గుమ్మడిదల

అఖండ భారతావనికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప‌టాన్ చెరు నియోజకవర్గంలోని పల్లె నుండి పట్నం వరకు స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల ద్వి సప్తాహ సంబరాలను ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంతో ప్రారంభించామని ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సంబరాల్లో భాగంగా రెండవ రోజైన మంగళవారం ప‌టాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు డివిజన్, ప‌టాన్ చెరు మండలం, జిహెచ్ఎంసి పరిధిలోని రామచంద్రపురం, భారతి నగర్, జిన్నారం, గుమ్మడిదలలో ఏర్పాటుచేసిన ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై జెండాలు పంపిణీ చేశారు. ప‌టాన్ చెరు పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాంధీ సినిమా ప్రదర్శనను వీక్షించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కోట్ల మంది త్యాగాలు, పోరాటాలతో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన భారతావని చరిత్రను నేటి తరాలకు తెలియజేశాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రెండు వారాలపాటు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రతి ఇంటికి జెండాల పంపిణీ, గాంధీ సినిమా ప్రదర్శన, వజ్రోత్సవ ర్యాలీలు, సంస్కృతిక సారథి కళాకారులచే ప్రత్యేక జానపద కళా ప్రదర్శనలు, సామూహిక జాతీయ గీతాలాపన, రక్తదాన శిబిరాలు, క్రీడా పోటీలు, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.

 

ప‌టాన్ చెరులో వజ్రోత్సవాల పైలాన్..

నియోజకవర్గ కేంద్రమైన ప‌టాన్ చెరులో భవిష్యత్తు తరాలకు చాటి చెప్పేలా ఏరియా ఆసుపత్రి అవరణలో జాతీయ రహదారి పక్కన ఫ్రీడమ్ పార్క్ తో, వజ్రోత్సవాల పైలాన్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. దీంతోపాటు భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తమ గృహాలపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ఆయన కోరారు.వజ్రోత్సవాల సంబరాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, రవీందర్ గౌడ్, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ రెడ్డి, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, అఫ్జల్, పాండు, రాజేష్, ఈర్ల రాజు, షేక్ హుస్సేన్, పరమేష్, పృథ్వీరాజ్, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

1 day ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

1 day ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

1 day ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

2 days ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago