మనవార్తలు ,పటాన్ చెరు:
సూపర్ – ఫినిషింగ్ లేత్ అటాచ్మెంట్ రూపకల్పన , విశ్లేషణ ‘ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి సయ్యద్ లాయక్ బాబామియాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . సూపర్ – ఫినిషింగ్ లేత్ అటాచ్మెంట్ ఎదుర్కొంటున్న సమస్యను కనుగొనడానికి ఈ పరిశోధన చేపట్టామని , లేత్ పనిచేసేటప్పుడు స్లీవ్ ఉష్ణ విస్తరణ కారణంగా డోలనం చేసే పిస్టన్ స్లీవ్లో మొరాయిస్తోందని విశ్లేషించినట్టు ఆయన తెలియజేశారు .
స్లీవ్ లోపలి భాగంలో గట్టి రబ్బరు పూత పూయడం ద్వారా ఓ పరిష్కారాన్ని సూచించామని , ఇది చాలా తక్కువ ఉష్ణ వాహకతను కలిగి ఉంటుందని , ఉష్ణోగ్రత పెరుగుదల కూడా చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు . ట్రైబ్రోమీటర్లో నిర్వహించిన పరీక్షతో దీనిని నిర్ధారించామని తెలిపారు . దానితోపాటు పిస్టన్కు కిరీటాన్ని అమర్చడంతో పాటు స్లీవ్ బయటి ఉపరితలంపై అధిక – ఉష్ణోగ్రత ఇన్సులేషన్ పూత పూశామని , ఇది వేడిచేసిన సిలిండర్ , గట్టి రబ్బరు పూత మధ్య అవరోధంగా పనిచేస్తుందని రుజువు చేశామన్నారు . బాబామియా సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…