_క్రీడాకారులకు అండగా ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్ చెరు
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి క్రీడాకారుల పట్ల మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్ ల నిర్వహణకు నిధులు అందిస్తూ క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరగనున్న 48వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న సంగారెడ్డి జిల్లా బాలబాలికల జట్లకు శనివారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సొంత నిధులతో యూనిఫామ్, షూస్ అందజేశారు.
పటాన్చెరు నియోజక వర్గానికి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. నియోజకవర్గాన్ని క్రీడల కేంద్రంగా గా తీర్చి దిద్దడంలో భాగంగా మూడు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రెండు జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు ఎల్లన్న, నరేందర్, క్రీడాకారులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…