Districts

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చెక్కుల పంపిణీ

_టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు:

దేశంలోని మొట్టమొదటి సారిగా కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించి, ప్రమాదవశాత్తు మృతి చెందితే రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మండలం కిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన కొడకంచి రామకృష్ణ, బొల్లారం మున్సిపాలిటీ బి.సి కాలనీకి చెందిన సత్యనారాయణలు టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఇటీవల వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. టిఆర్ఎస్ పార్టీ అందించిన బీమా సౌకర్యం కలిగి ఉండటంతో, ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా మంజూరైంది.

ఈ మేరకు శనివారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి భీమా సౌకర్యం అందించడం జరిగిందన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకునే ఏకైక పార్టీ టిఆర్ఎస్ అన్నారు. కార్యకర్తల సమిష్టి కృషితోనే నేడు టిఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారం చేపట్టిందనీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, రెండో వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago