హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు పట్టణంలో హోళీ వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో హరే రామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. బీరంగూడ కు చెందిన కుమవత్ మార్వాడి సమాజం ఆధ్వర్యంలోని బృందం ఎమ్మెల్యే జీఎంఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. తన నివాసంలో కుటుంబ సభ్యులు, మనుమడు మనుమరాలు లతో ఎమ్మెల్యే జిఎంఆర్ హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…