మానసిక స్థితి సరిగా లేని యువకుడు అదృశ్యం…
పటాన్ చెరు :
మానసిక స్థితి సరిగా లేని యువకుడు అదృశ్యమైన సంఘటన పటాన్చెరు మండల పరిధిలో చోటుచేసుకుంది.యువకుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… పెదకంజర్ల గ్రామానికి చెందిన అశోక్ శనివారం ఉదయం గ్రామ సమీపంలో ఉన్న పొలం వద్దకు తన కుమారుడు అజయ్ తో బయలుదేరాడు. ఈ క్రమంలో అశోక్ ముందు వెళుతుండగా అతని వెనకాల కుమారుడు అజయ్ గొడుగు పట్టుకొని నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్లాడు. కొంత సేపటికి అశోక్ తన కుమారుడు వస్తున్నాడా లేదా అని వెనకకు చూడగా కనిపించలేదు. దీంతో అజయ్ కోసం కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా కొందరు అదృశ్యమైన అజయ్ ఇస్నాపూర్ పరిధిలో కనిపించడాని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి అక్కడా సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో అజయ్ కనిపించాడు.కొడుకు అదృశ్యంపై తండ్రి పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అజయ్ కనిపిస్తే ఈ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని యువకుడి తండ్రీ అశోక్ కోరారు. 9666864388.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…