Telangana

కులం, మతం, వర్గం తేడా లేకుండా అందరి శ్రేయస్సు లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు

_అభినవ దాన కర్ణుడు ఎమ్మెల్యే జిఎంఆర్

_50 లక్షల రూపాయల సొంత నిధులతో మసీదు పునర్నిర్మాణం

అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి :

కులం, మతం, వర్గం తేడా లేకుండా నియోజకవర్గంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణాలకు అభినవ దానకర్ణుడు వలె లక్షల రూపాయల సొంత నిధులను అందిస్తూ నియోజకవర్గంలో పరమత సహనాన్ని పెంపొందిస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.తాజాగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గల అమీనా అలంగిర్ మసీదు పునర్నిర్మానం కోసం 50 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, ప్రతి ఒక్కరూ పరమత సహనాన్ని పాటించాలని కోరారు. భిన్నత్వంలో ఏకత్వం వలె పటాన్చెరు నియోజకవర్గంలో అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ముస్లిం మైనారిటీ మత పెద్దలు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

14 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

15 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago