టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి….
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
కరోనా కష్ట కాలంలోనూ రంజాన్ పర్వదినం పురస్కరించుకొని అర్హులైన ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ తోఫా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని పెద్ద మసీదు ప్రాంగణం లో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వారి వారి ప్రధాన పండుగలను సంతోషంగా నిర్వహించుకోవాలన్న సమున్నత లక్ష్యం తో బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. కరోనా మూలంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికిని సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల గిఫ్ట్ ప్యాక్ లను ప్రభుత్వం పంపిణీ చేసేందుకు నిర్ణయించిందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మసీదు కమిటీ ఆధ్వర్యంలో వారి వారి పరిధిలోని అర్హులైన నిరుపేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…