Telangana

అభివృద్ధి..సంక్షేమం కొనసాగాలంటే బి ఆర్ ఎస్ ను ఆశీర్వదించండి..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_మాట ఇస్తే.. మడమ తిప్పం..

_పటాన్చెరు ఇక రెవెన్యూ డివిజన్..

_సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చారు..జీవోలు జారీ చేశారు..

_శరవేగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనులు..

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. పటాన్చెరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు రెవెన్యూ డివిజన్ సేవలు అత్యంత అవసరమని ఇటీవల పటాన్చెరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని తెలిపారు.దీంతోపాటు ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరులో పాలిటెక్నిక్ కళాశాల లేకపోవడం మూలంగా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం లేదని విన్నవించడం జరిగిందని తెలిపారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ ప్రజల సమక్షంలోని హామీలు ఇవ్వడంతో పాటు, గురువారం వీటికి సంబంధించిన జీవోలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు.

ఇప్పటివరకు సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లో గల పటాన్చెరువు, రామచంద్రాపురం, అమీన్పూర్, గుమ్మడిదల, జిన్నారం మండలాలతో కూడిన పటాన్చెరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతుందని తెలిపారు.నూతన పాలిటెక్నిక్ కళాశాలకు సైతం అతి త్వరలో స్థలం కేటాయించి భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.గతంలో పటాన్చెరుకి సబ్ రిజిస్ట్రార్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీరో జారీ చేసిందని, ఇందుకు సంబంధించి పలువురు అభ్యంతరాలు లేవనెత్తడంతో.. కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేసి తిరిగి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.వచ్చేనెల సెప్టెంబర్ రెండవ వారంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు పనులకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు.వీటితోపాటు ఉస్మాన్ నగర్ లో ఐటీ టవర్ ఏర్పాటుకు సంబంధించి సంబంధిత శాఖ సన్నాహాలు ప్రారంభించిందని తెలిపారు.

ప్రజలకు హామీలు ఇవ్వడంతో పాటు వాటి అమలుకు కృతనిచ్చయంతో పనిచేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు.గత తొమ్మిది సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా నిలపడంతో పాటు, సంక్షేమంలో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నామని తెలిపారు.వీటితోపాటు మండల కేంద్రమైన గుమ్మడిదలలో మినీ స్టేడియం, జూనియర్ కాలేజ్, వ్యవసాయ గోదాం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరినట్లు తెలిపారు.ప్రజల ఆశీర్వాదంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago