Telangana

సీఎస్ఆర్ ఓ సమగ్ర విధానం : స్వాతి

మనవార్తలు ,పటాన్ చెరు:

సంస్థల సామాజిక బాధ్యత ( సీఎస్ఆర్ ) అనేది కేవలం ఒక కార్యకలాపాన్ని ప్రారంభించడమే కాదని , ఇది సంపూర్ణమైన , డిమాండ్ – ఆధారిత , విలువ – ఆధారిత , హక్కుల ఆధారిత విధానంగా ఉండాలని హైదరాబాద్లోని నాట్కో ఫార్మా సీఎస్ఆర్ అధిపతి స్వాతి కాంతామణి అన్నారు . హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తొలి ఏడాది విద్యార్థుల ఇండక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా ‘ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ త్రూ సీఎస్ఆర్ ‘ అనే అంశంపై గురువారం ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు . కార్పొరేట్ రంగం జాతీయ స్థూల ఉత్పత్తి ( జీడీపీ ) కి తన వాటాను జోడించడం , ఉపాధి కల్పన కోసం . మాత్రమే కాదని , సామాజిక అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం వహిస్తుందని , సమాజానికి తిరిగి ఇవ్వడంలో సీఎస్ఆర్ ఒక భాగమని ఆమె స్పష్టీకరించారు .

ఆరోగ్యం , క్రీడల ప్రోత్సాహం , కమ్యూనిటీ ఆధారిత మౌలిక సదుపాయాలు , విద్య , జీవనోపాధి , నీరు , పరిశుభ్రత , పారిశుధ్యం వంటి రంగాలు సామాజిక సేవకు అనుగుణమైనవిగా స్వాతి అభివర్ణించారు . ఈ సందర్భంగా నాట్కో ఫార్మా అందిస్తున్న పలు రకాల సేవలు , వైద్య సదుపాయాలు , పాఠశాలలు నెలకొల్పడం వంటి వాటిని వివరించారు . ఈ సామాజిక సేవా ప్రాజెక్టుల గుర్తింపు , సహాయక సేవలు , వాటిని బలోపేతం చేసే పద్ధతులు , అకౌంటింగ్ , సామర్థ్యం పెంపుదల , నిర్వహణ , పర్యవేక్షణ , ప్రాజెక్టుల ప్రభావాన్ని అంచనా వేయడం వంటి పలు సమాజాభివృద్ధి . రంగాలలో పరిశోధనలకు ఎంతో ఆవశ్యకత ఉందన్నారు . వీటిపై అధ్యయనానికి పరిశ్రమ విద్యా సంస్థలు కలసికట్టుగా పనిచేస్తే అద్భుత ఫలితాలను సాధించవచ్చని నాట్కో ఫార్మా సీఎస్ఆర్ అధినేత అభిలషించారు . విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సందర్భోచిత , సూటి సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు .

ఎకో – ఏకదంత కార్యశాల గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ఆధ్వర్యంలో ‘ ఎకో – ఏకదంత ‘ కార్యశాలను చరెతి , సినర్జీ , వెంచర్ డెవలప్మెంట్ సెల్ , ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ సెల్లు గురువారం సంయుక్తంగా నిర్వహించాయి . ఈ కార్యశాలలో భాగంగా విద్యార్థులతో మట్టి గణపతులను చేయించి , దానిని విక్రయించి మరో సత్కార్యం కోసం వెచ్చించాలని సంకల్పించారు . అలాగే , గీతం బాయ్స్ హాస్టల్లో అధిక వ్యయంతో ఆధునీకరించిన సెంట్రల్ కిచెన్లో కళాకృతి విద్యార్థులు ‘ లెస్ట్ బ్యాండ్’తో అందరినీ అలరించారు .

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago