మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పటాన్ చెరు పట్టణం లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికా,ఇజ్రాయిల్, ఇరాన్ పైన యుద్ధం కొనసాగిస్తుండడం మూలంగా చమురు ధరలు పెరిగాయని అన్నారు. వెంటనే అమెరికా యుధోన్మాదాన్ని ఆపాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ప్రస్తుతం 905 రూపాయలు ఉన్న గ్యాస్ కేంద్ర ప్రభుత్వం 60 రూపాయలు పెంచడం మూలంగా 965 రూపాయలకు చేరిందని చెప్పారు. కమర్షియల్ గ్యాస్ పైన 115 రూపాయలు అదనంగా పెంచడం మూలంగా సామాన్య, మధ్యతరగతి ప్రజానికం పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని వాపోయారు. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పైన దాడి చేస్తున్న యుద్ధం విషయంలో, మన భారత ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం మనకు ఆయిల్ నిక్షేపాలు రష్యా నుంచి వస్తున్నాయని, గతంలో ఇరాన్ నుంచి వచ్చేవని ఇరాన్ లో ఉన్న ఆయిల్ నిక్షేపాలను అన్నింటిని అమెరికా హస్తగతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ఆయిల్ నిక్షేపాల విషయంలో ఇప్పటికీ అమెరికా జోక్యంతోనే రష్యాలో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఇరాన్ యుద్ధం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత తీవ్రతనం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి బి నాగేశ్వరరావు, ఏరియా కమిటీ సభ్యులు ఎండీ వాజీద్ అలీ, పి పాండురంగారెడ్డి, బి పెంటయ్య, జార్జ్, రామకృష్ణ, నారాయణ ఇతరులు పాల్గొన్నారు.
36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…
పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…
అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…
పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…