_యువత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
_పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
యువత చెడు వ్యసనాలతో పెడదారి పట్టకుండా, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తిలో 30 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన గోనెమ్మ యూత్ అసోసియేషన్ భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యువత అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. విద్యారంగం తో పాటు క్రీడల్లో రాణిస్తున్న యువతకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రాజు, నాయకులు, పుర పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…