Telangana

క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో ఘనంగా ప్రారంభమైన 36వ మైత్రి క్రికెట్ కప్ పోటీలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

నేటి తరం యువత క్రీడల పై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. క్రికెట్ అభివృద్ధికి మైత్రి క్రికెట్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 36వ మైత్రి క్రికెట్ ట్రోఫీని సోమవారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని క్రీడారంగానికి కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం 7 కోట్ల 50 లక్షల రూపాయలతో ఆధునిక వసతులతో మైదానాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. గత 36 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న ఘనత మైత్రి క్రికెట్ క్లబ్ కి దక్కిందని తెలిపారు. నియోజకవర్గంలో క్రీడల పైన ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న క్రీడాకారులకు. అండగా ఉంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పారిశ్రామికవేత్తలు కే. సత్యనారాయణరెడ్డి, సి. సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, సిఐ వినాయక్ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత రెడ్డి, కబడ్డీ జాతీయ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నర్రా బిక్షపతి, ఇక్బాల్, శ్రీధర్ చారి, పృథ్వీరాజ్, వెంకటేష్, ఎల్లయ్య, గిరి, సంజీవ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago