Telangana

సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ సంక్షేమ సంఘం కోసం వెయ్యి గజాల స్థలం భవన నిర్మాణం

అర్హులైన సెంట్రింగ్ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

ప్రతి కార్మికుడికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా చర్యలు

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగానికి కీలకంగా మారిన సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అతి త్వరలో వెయ్యి గజాల స్థలం కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో నియోజకవర్గస్థాయి సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు కార్మికుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనులు చేయాలని కోరారు. సంఘం సభ్యుల కోరిక మేరకు అతి త్వరలో వెయ్యి గజాల స్థలంతో పాటు భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. కార్మిక శాఖ అధికారులతో చర్చించి ప్రతి కార్మికుడికి ఆరోగ్య భద్రతను అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి సెంట్రింగ్ కార్మికుడికి స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు లేనివారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, నర్రా బిక్షపతి, శ్రీధర్ చారి, పృథ్వీరాజ్, రాజు, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు యాదగిరి, అధ్యక్షులు కృష్ణ, ప్రధాన కార్యదర్శి జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago