Telangana

కాంగ్రెస్ ముదిరాజులకు ఇచ్చిన హామీని నిలబెడుతుంది ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర జ్ఞానేశ్వర్

మనవార్తలు ప్రతినిధి ,  శేరిలింగంపల్లి :

కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీని నిలబెడుతుందని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బోర జ్ఞానేశ్వర్ అన్నారు.తెలంగాణ ఐక్య ముదిరాజ్ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఖానా మెట్ శాఖ పదవి వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో ముదిరాజులకు బిసి-డి నుండి బిసి ఏలో చేర్చే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ బిసి సమాజంలో మొదటి వరుసలో ఉన్న ముదిరాజులు రాజకీయంగా ఇంకా వెనుకబడి ఉన్నారని ముదిరాజులకు మంచి అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ముదిరాజులకు ఎలాంటి మేలు చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కుటుంబ సర్వే నిర్వహించి తెలంగాణలో ఉన్న వివిధ సామాజిక వర్గాల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆ నివేదిక ప్రకారం సామాజిక వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివయ్య ముదిరాజ్ మాట్లాడుతూ జనాభా లెక్కల ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం ముదిరాజు లెక్కన చూపించడం చాలా సంతోషకరమైన విషయమని అదే విధంగా ముదిరాజ్ వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తులకు ప్రభుత్వం వెనువెంటనే పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, శేర్లింగంపల్లి కాంగ్రెస్ నేర్కవర్గం ఇన్చార్జి జగదీష్ గౌడ్,ఖానా మెట్ శాఖ అధ్యక్షులు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఆలయ కమిటీ అధ్యక్షులు సతీష్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు వివిధ ముదిరాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago