పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మెదక్ పార్లమెంటు నుంచి పోటీలో ఉన్న బిజెపి, బిఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ కూడా దొంగలేనని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జ్ కొండా సురేఖ అన్నారు. పటాన్ చెరు మండలంలోని రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ లో గల శ్రీ గణేష్ దేవాలయం లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ నిర్మల, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు లతో కలిసి ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి , జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించారు ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ రెండోసారి కూడా ఈ తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కు పట్టం కడితే, వారిలో ఎటువంటి మార్పులు రాలేదని, ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని , అసెంబ్లీ కి రానటువంటి మాజీ సీఎంకేసీఆర్ ఎన్నికలు రావడంతోనే బయటకు వచ్చారని ఆరోపించారు. సామాన్యుల ఫైళ్లను టేబుల్ ఫైళ్లను పక్కన పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ కేవలం మేడిగడ్డ మిషన్ భగీరథ వంటి ఫైళ్ళ పైనే సంతకాలను చేస్తూ పరిపాలన కొనసాగించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలను ఇంటింటికి తీసుకుపోయి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులకు సురేఖ సూచించారు. అలాగే ఈ ఎంపీ ఎన్నికలే నాయకుల భవిష్యత్తును డిక్లేర్ చేస్తాయని కూడా పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులు కార్యకర్తలను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎలక్షన్స్ పటాన్చెరు కోఆర్డినేటర్ శ్యామ్ గౌడ్, దేవస్థాన కమిటీ చైర్మన్ వెంకన్న, పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇంచార్జ్ లు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, మునిసిపల్, పట్టణ, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…