భూదాన్ భూముల సమగ్ర సర్వే చేసి కబ్జాకోరుల భరతం పట్టండి–సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శంకర్ నాయక్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

తెలంగాణ రాష్ట్రంలో భూదాన భూములు కాపాడుటకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేసి భూములను ఆక్రమించి అన్యాక్రాంతం చేస్తున్న కబ్జాకోరుల భరతం పట్టాలని,చట్టపరంగా కఠినంగా శిక్షించాలని సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ శంకర్ నాయక్ అన్నారు .సంగారెడ్డి జిల్లా సర్వోదయ మండల్ జిల్లా సమావేశం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఉప్పరి రవీందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు .ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సర్వోదయ మండల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ శంకర్ నాయక్ హాజరయ్యారు . అనంతరం మాట్లాడుతూ వినో బాబావే పేద ప్రజల కోసం 14 సంవత్సరాలు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి దానంగా స్వీకరించిన భూదాన భూములను పేద ప్రజలకు చెందకుండా ఆయన ఆశయాలను నీరుగారిస్తున్నారు. లక్షల కోట్ల విలువైన భూములను భూ బకాసురులు ఆక్రమిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు భూదాన భూముల విషయంలో వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు . దేశంలోనే మొట్టమొదటిగా దానంగా స్వీకరించిన చరిత్ర ఈ రాష్ట్రానికి ఉందని అటువంటి రాష్ట్రంలో ఈ విధంగా జరగడం దారుణమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై గిరిప్రసాద్ మాట్లాడుతూ అన్ని జిల్లాలలో సర్వోదయ మండల్ కమిటీలు ఏర్పాటు చేసి వినోద్ బాబాయ్ ఒక రక్త బొట్టు చిందకుండా లక్షల ఎకరాలు సేకరించి దాన్ని కాపాడుటకు వినోబాభావే నామిని అయిన సర్వ సేవా సంఘం సలహాతో భూదాన్ యజ్ఞ బోర్డ్ ఏర్పాటు చేయాలని ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా సర్వోదయ మండల్ జిల్లా కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా ఎన్ రాజు ముదిరాజ్, జిల్లా ప్రతినిధిగా డాక్టర్ కిషన్, జిల్లా కార్యదర్శిగా ఎస్.కె గంగారం, జిల్లా ఉపాధ్యక్షులుగా గోపాల్, ఎం భాస్కర్,జిల్లా సహాయ కార్యదర్శిగా చందా శ్రీనివాస్,పోల్లూరు శంకర్ గౌరవ అధ్యక్షులుగా అన్వర్ పటేల్, ఉప్పరి రవీందర్,ఏకగ్రీవంగా సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ శంకర్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైగిరి ప్రసాద్ ,రంగారెడ్డి జిల్లా మహిళా సంఘ అధ్యక్షురాలు నాగజ్యోతి ,సమక్షంలో ఏ కమిటీని ఎన్నిక చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *