Hyderabad

చదువుతోనే సమాజ అభివృద్ధి : యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు

గుమ్మడిదల:

చదువుతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు అన్నారు. గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 32 ఇంచుల ఎల్ఈడి టీవీని శనివారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులకు యండిఆర్ పౌండేషన్ తరఫున దేవేందర్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఆన్ లైన్ తరగతులు నడుస్తున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు టీవీని అందజేసినట్లు తెలిపారు. దీనివల్ల పేద విద్యార్థుల చదువులు సజావుగా సాగుతాయన్నారు.

నేటి బాలల భవిష్యత్తుకు వెలుగు చూపే ఆయుధం విద్య అన్నారు. వారందరూ ఉన్నత చదువులు చదివి సుఖవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కడా సామూహిక సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. యండిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో తమ కార్యక్రమాలు మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు.

 

కార్యక్రమంలో గుమ్మడిదల ముదిరాజ్ సంఘము అధ్యక్షుడు గ్యారాల మల్లేష్, ఉపాధ్యక్షుడు యాదగిరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రదీప్ కుమార్, వెంకటేష్, కోశాధికారి వీరేశ్, అనంతారం మాజీ ఉపసర్పంచ్ గోపాల్ చక్రపాణి, తిరుమల, నిర్మల కుమారి, కవిత, నిర్మల, యండిఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

4 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

4 days ago