Telangana

కరోనా పేషంట్లకు కో హెల్ప్ యాప్ ఓ వరం లాంటింది -కాళీ చరణ్

కరోనా పేషంట్లకు కో హెల్ప్ యాప్ ఓ వరం ….

-కాళీ చరణ్

హైదరాబాద్:

కరోనా కేసులు పెరుగుతుండటంతో హాస్పటల్స్‌లో బెడ్స్ నుంచి క్రిమేషన్ వరకు అన్ని రకాల సర్వీసులు అందించేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. కరోనా రోగులకు సహాయం అందించేందుకు కో హెల్ప్ యాప్ ను ,వెబ్‌సైట్‌ను సాగర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ సంస్థ రూపొందించింది.తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్‌ బెడ్స్, అంబులెన్స్‌, ఆక్సిజన్ ఫెసిటిటీ,రెమిడెసివర్ వంటి మెడికల్ ఫెసిలిటీస్‌ సమాచారం యాప్‌లో అందుబాటులో ఉంటుందని నిర్వహకులు తెలిపారు .

భవిష్యత్‌లో ఇండియా మొత్తం సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు సంస్థ సీఈఓ రితీష్ వెంకట్ తెలిపారు.

ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో బెడ్స్‌,ఆక్సిజన్ ,అంబులెన్స్‌, వ్యాక్సినేషన్ తదితర విషయాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు యాప్‌ను తీసుకురావడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి సభ్య కార్యదర్శి కాళీ చరణ్ అన్నారు .

హైదరాబాద్ అరణ్యభవన్‌లో సాగర్ సాఫ్ట్‌వేర్ సంస్థ రూపొందించిన కో హెల్ప్‌ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు నాలుగువేల ఆసుపత్రులతో తాము టై అప్ అయ్యామని …కోవిద్‌ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే చికిత్స అందించేలా ఈ యాప్ రూపకల్పన జరిగిందని సాగర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సీఈఓ జోగి రితీష్ వెంకట్ తెలిపారు.

యాప్ ద్వారా బెడ్ బుక్ చేసుకున్న కరోనా పేషెంట్లకు ఎక్కువ మొత్తం వసూలు చేస్తే …ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కరిస్తామన్నారు .తమ యాప్‌కు తెలుగు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని …మొదటి రోజు రెండువందల మందికిపైగా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని కరోనా సర్వీసులు పొందుతున్నట్లు రితీష్ తెలిపారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

17 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

18 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago