Telangana

నూతన సంవత్సరంలో మెదక్‌పై సీఎం ప్రత్యేక దృష్టి

మెదక్ అభివృద్ధికి నూతన ఏడాదిలో నూతన ఊపు

సీఎం రేవంత్ రెడ్డికి నీలం మధు న్యూ ఇయర్ శుభాకాంక్షలు

రేవంత్ రెడ్డిని కలిసిన నీలం మధు – అభివృద్ధిపై కీలక చర్చ

సీఎం రేవంత్ రెడ్డితో నీలం మధు కీలక భేటీ

మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రితో నీలం మధు సుదీర్ఘంగా చర్చించారు. పటాన్‌చెరు ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం రెండు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాలు, అలాగే రెండు నూతన పోలీస్ స్టేషన్లను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ నిర్ణయాల వల్ల పరిపాలన మరింత ప్రజలకు చేరువ అవుతుందని, శాంతి భద్రతలు పటిష్టం అవుతాయని నీలం మధు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డివిజన్ల సమగ్ర అభివృద్ధితో పాటు నూతనంగా ఏర్పాటు కానున్న మున్సిపాలిటీలకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.అదే సమయంలో మెదక్ పార్లమెంట్ పరిధిలో రానున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు మరియు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీలం మధుకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని తెలిపారు.దీనికి స్పందించిన నీలం మధు ముదిరాజ్, మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచే విధంగా నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజల మధ్య ఉండి నిరంతరం సేవ చేస్తామని వెల్లడించారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago