Telangana

దివ్యాంగుల దేవుడు సీఎం కేసీఆర్_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_500 నుండి 4016 రూపాయలకు పెన్షన్ పెంచిన మహోన్నత నాయకుడు

_నూతన పెన్షన్ ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

సమాజంలో అత్యంత వివక్షతకు, అపహస్యాలకు గురవుతున్న దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు 500 రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచి వారి పాలిట దేవుడిగా మారిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారుల సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇటీవల పెంచిన పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను దివ్యాంగులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన దివ్యంగుల సంక్షేమానికి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన విజనరీ లీడర్ సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వికలాంగులకు 4016 రూపాయల పెన్షన్ అందిస్తూ సీఎం కేసీఆర్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని అన్నారు.తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ప్రగల్బాలు పలుకుతున్న ప్రతిపక్ష పార్టీలకు చెంప చెల్లుమనేలా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.అన్నం పెట్టే చేతికి సున్నం పెట్టవద్దు అన్న సామెతకు అనుగుణంగా.. సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు అందించాలని కోరారు.

రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులకు సొంత నిధులతో సుమారు 300కు పైగా స్కూటీలను పంచి వారి సంక్షేమానికి కృషి చేశామని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ తగు ప్రాధాన్యత అందిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, ఎంపీపీలు దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు లలితా సోమిరెడ్డి, రోజా బాల్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago