పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ధీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు.పటాన్చెరు మండలం లకాడారం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామంలోని ముస్లింల స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు మహనీయుల చరిత్రను తెలియజేయాలన్న సమన్నత లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శివాజీ తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. శివాజీ అనుసరించిన పరిపాలన విధానాలు, వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శప్రాయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సువర్ణ మాణిక్ రెడ్డి, ఎంపిటిసి శైలజ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, గ్రామ పుర ప్రముఖులు, ముస్లిం మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…