మనవార్తలు,రామచంద్రపురం
రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం లో బిజెపి రాష్ట్ర మరియు జిల్లా కమిటి ఆదేశానుసారం రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి పట్టణ బిజెపి పార్టీ కార్యాలయంలో జైభీందీక్షకు దిగారు. ఈ సందర్బంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి భారత రాజ్యాంగాన్ని మార్చాలని దళితులను మరియు డా. అంబేద్కర్ అవమానించే విధంగా మాట్లాడటం సరికాదు అని అన్నారు .
అదేవిధంగా 7సం ల కాలంలో దళితుణ్ని ముఖ్యమంత్రి చెస్తాను అని, మూడు ఎకరాల భూమి ఇస్తానని, దళితబందు అమలుచెస్తా అని అన్ని బూటకపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు. ఈ చేతకాని ముఖ్య మంత్రి రాజ్యాంగాన్ని మార్చాలనడం రాజ్యాంగం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆమె అన్నారు .ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు అంజిరెడ్డి, ఓబీసీ మోచ అధ్యక్షులు యాదగిరి, మల్లేష్, రవీందర్ గౌడ్,లక్ష్మణ్, పెంటారెడ్డి, రాంబాబు, రాజు, కృష్ణ రెడ్డి, రమేశ్ గుప్తా, లక్ష్మణ్ గౌడ్, కటికే శ్రీను, శ్రీనివాస రావు, మైనారిటీ నాయకులు షఫి,సల్మాన్, బాబ్జీ,ప్రసాద్ రావు,అమృత,అజాజ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…