_ఎమ్మెల్యే జిఎంఆర్ సహకారంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు
_మైత్రి మైదానంలో భారీ జాగరణ
_ముఖ్య అతిథిగా భోజ్ పురి నటుడు కేసరి లాల్ యాదవ్
మనవార్తలు ,పటాన్ చెరు:
విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన పటాన్చెరు నియోజకవర్గంలో మరో భారీ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు అండగా నిలిచారు.మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఉదయం సాకి చెరువు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఉత్తర భారతీయుల అసోసియేషన్ ప్రతినిధి సందీప్ షా లు వెల్లడించారు.
నియోజకవర్గంలోని సబ్బండ వర్గాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ ఛట్ పూజా సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారని వారు తెలిపారు.సాకి చెరువు కట్టపై ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు నిర్వహించనున్న పూజల సందర్భంగా ప్రత్యేకంగా ఘాట్లు, లైటింగ్, మంచినీరు, గజ ఈతగాళ్లు, సంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సోమవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక మైత్రి మైదానంలో భోజ్పూర్ నటుడు కేసరి లాల్ యాదవ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి భారీ ఎత్తున ప్రజలు హాజరు కాబోతున్నట్లు తెలిపారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…