Districts

విద్య ద్వారానే సమాజంలో మార్పు_గూడెం విక్రమ్ రెడ్డి

మనవార్తలు ,పటాన్చెరు

విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందనీ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు గూడెం విక్రం రెడ్డి అన్నారు. టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గూడెం విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ విద్య ద్వారానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలోని రుగ్మతల పై పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, తారా సింగ్, సోహెల్, సంస్థ ప్రతినిధులు ఫసి, ఫైజాన్, ఇలియాస్, ఇమ్రాన్, జైకుద్దిన్, తదితరుల పాల్గొన్నారు

Ramesh

Recent Posts

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: కాంగ్రెస్ నేతల డిమాండ్

పటాన్‌చెరులో మహిళా కాంగ్రెస్ శక్తి ప్రదర్శన గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం మనవార్తలు…

1 day ago

వియత్నాం విద్యార్థులకు కృత్రిమ మేధస్సులో శిక్షణ

బూట్ క్యాంపు మెంటర్ గా గీతం అధ్యాపకుడు రెండు వారాల పాటు మార్గదర్శనం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వియత్నాంలోని…

1 day ago

యాజమాన్యం స్పందించకపోతే సమ్మెను తీవ్రతరం

కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కార్మిక శాఖ చలో జాయింట్ లేబర్ కమిషనర్ నిర్వహిస్తాం సిఐటియు…

1 day ago

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి ఈనెల 30న కళాశాలల బహిష్కరణ బిసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్…

1 day ago

బంజారాహిల్స్‌లో సువర్ణం జ్యువెల్స్ రెండో షోరూమ్ ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ప్రీమియం డిజైనర్ ఆభరణాల బ్రాండ్ సువర్ణం జ్యువెల్స్ హైదరాబాద్‌లో రెండో షోరూమ్‌ను బంజారాహిల్స్ రోడ్ నెం.10లో…

2 days ago

పార్కులు ప్రజల ఆరోగ్యానికి భవిష్యత్ తరాల ఆనందానికి చిరునామా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్: పార్కులు ప్రజల ఆరోగ్యానికి. భవిష్యత్తు తరాల ఆనందానికి చిరునామాగా నిలుస్తాయని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం…

2 days ago