– 2024 ఎన్నికలపె గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో వ్యాఖ్య
పటాన్ చెరు టౌన్:
విపక్ష పార్టీల ఐక్యత అవశ్యమని , అవన్నీ ఒక గాటికి వచ్చి , ఉమ్మడి అవగాహనతో రానున్న రెండేళ్ళ కాలం కలిసికట్టుగా పోరాడితే ప్రస్తుతం పాలిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికలలో ఢీకొట్టవచ్చని లోక్సభ సభ్యుడు , రచయిత , పూర్వ విదేశాంగ శాఖ మంత్రి శశిధరూర్ చెప్పారు . ‘ గీతం ఛేంజ్ మేకర్స్ ‘ కార్యక్రమంలో భాగంగా శనివారం గీతం విద్యార్థులు , పలువురు అధ్యాపకులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు . ఎన్డీటీవీ పూర్వ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ – గీతం వ్యూహాత్మక కార్యక్రమాలు – విస్తరణ డెరైక్టర్ నిధి రజ్జాని సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ , మోడీ రెండుమార్లు 31 , 37 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చారని , ప్రతికూల ఓట్లే పెద్ద సంఖ్యలో ( 69 , 63 శాతం ) ఉన్నాయన్నారు . అంతేకాక ఆర్థిక వ్యవస్థ పతనం , నిరుద్యోగిత విపరీతంగా పెరగడం , కోవిడ్ -19 ని సరిగా ఎదుర్కోలేక ఆక్సిజన్ , ఆస్పత్రులలో పడకలు లేక అనేక మరణాలకు దారితీయడం , అంతిమ సంస్కారం కూడా చేయలేక పార్థివదేహాలను గంగపాలు చేయడం వంటి వెఫల్యాలు ఎన్నో ఉన్నాయని , రెత్తుల ఆందోళనపై అతిశయంతో వ్యవహరించారని , అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నరేగా , జనధన్ వంటి పలు సంక్షేమ పథకాలు అమలుచేసి చరిత్ర ఉండనే ఉందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు .
మమతాబెనర్జీ కలిసి రావడంపై ఆయన విశ్వాసం వ్యక్తపరుస్తూ , ఆమె తమతో అధిక కాలం కలిసి పనిచేసిందని , ఎన్నో అంశాలలో భావసారూప్యం ఉందని , అయితే గతంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరునే ఇటీవల ఎన్నికలలో కాంగ్రెస్ పట్ల ఆమె వ్యక్తపరిచినట్టు చెప్పారు . సోషల్ మీడియా ప్రజల ఆలోచనా తీరుపై ప్రభావం చూపుతోందని , అధికారంలో ఉన్నవారు దానిని కాపాడుకోవడం కోసం అనుకూల అంశాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నారని , దీనిపై ప్రజల ఆలోచనా తీరులో , మరీ ముఖ్యంగా ఉత్తర భారతీయుల ఆలోచనా తీరులో మార్పు రావాలని శశిధరూర్ అభిప్రాయపడ్డారు . దాదాపు 45 ట్రిలియన్ డాక్టర్ల భారతదేశ సంపదను 200 ఏళ్ళ ఆంగ్లేయ పాలనలో కొల్లగాట్టారని , అభివృద్ధి చెందిన జాబితాలో రెండో స్థానంలో ఉన్న మనం వెనుకబాటుకు లోనయ్యామన్నారు . 90 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని , 27 ఏళ్ళ సగటు జీవన ప్రమాణంగా ఉందని విచారం వెలిబుచ్చారు .
మనదేశంలోని కొన్ని ప్రాంతాలు బాగా వృ ద్ధి సాధించాయని , హార్డ్వేర్ , నౌకాశ్రయాలు , రైల్వే , రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతో పాటు పారిశుధ్యం , ప్రజారోగ్యాలను కూడా వృద్ధి చేసుకోవాలని సూచించారు . ఓ సగటు భారతీయుడు అనారోగ్యం పాలెత్తే ఐదు కిలోమీటర్ల లోపు వెద్య సదుపాయం లేదని , 26-27 శాతం మంది మాత్రమే కళాశాల విద్యను అభ్యసించగలగుతున్నారని , విద్యను ప్రాథమిక హక్కుగా అమలు చేయడంతో పాటు ప్రతి భారతీయుడు మూడు పూటలా తిని , సొంత ఇంట్లో ఉంటూ , తమ పిల్లలకు మంచి చదువు , గౌరవ వేతనం కూడిన ఉపాధి వంటి అందితే మనం కూడా వృద్ధి చెందవచ్చని విశ్లేషించారు . తన బాల్యం , కుటుంబ నేపథ్యం , విద్య , దేశంలోని పలు ప్రాంతాలలో నివాసం , విద్యార్థి దశ , ఎమర్జెన్సీలో వ్యవహరించిన తీరు , కాంగ్రెస్ పార్టీలో చేరికతో పలు వివాదస్పద ట్వీట్ల వంటి వాటిని వివరించారు . ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ రాయడానికే అధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…