శేరిలింగంపల్లి :
కల్లు తాగుడుగు బానిసై చెడుతిరుగుళ్లు తిరుగుటకు అడ్డువస్తుందని తలిచిన కసాయి తల్లి తన 5 ఏళ్ల కూతురుని దారుణంగా హత్య చేసి, ఆ హత్య ను తాను ఉంటున్న ఇంటి ఓనర్ పై నెట్టాలని చూసిని తల్లిని, ఆమెకు సహకరించిన ఆమె తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం చందానగర్ లోని శాంతినగర్ లో నివసించే వడ్డే యాదమ్మ కు 13 ఏళ్లక్రితం మీర్ పెట్ కు చెందిన రాము తో వివాహం అయింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ముగ్గురు పిల్లలు కాగా వివిధ కారణాలతో ఇద్దరు అబ్బాయిలు మృతి చెందారు. చీటికీ మాటికి మొగుడితో గొడవ పడడం తో రాము వాళ్ళ ఊరెల్లిపోయాడు.
యాదమ్మ చెడు తురుగుళ్లు తిరుగుతూ కళ్ళు తాగుతూ ఉంటుంది. తన వివాహేతర సంబంధాలకు అడ్డువస్తుందని భావించిన తన 5 ఏళ్ల కూతురు కృష్ణవేణి ని దారుణంగా చంపేసింది. తర్వాత తన ఇంటికి వచ్చిన తల్లి తిమ్మమ్మ లు కల్సి ఆ హత్య నేరాన్ని వాళ్ళ ఇంటి ఓనర్ పై వేయాలని చూసి వాళ్ళ ఇంట్లోని టివి. ఇతర ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పాప తండ్రి రాము ఈమె పై అనుమానంతో చందానగర్ పోలీసులుకు పిర్యాదు చేయగా పాప శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు పంపి, వచ్చిన రిపోర్ట్ ఆధారంగా యాదమ్మ, తల్లి తిమ్మమ్మ లను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి,శాంతినగర్ ,చందానగర్ ,పోలీస్ స్టేషన్,హాస్పిటల్ ,కృష్ణవేణి , పోస్టుమార్టం,శవాన్ని
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…