కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీ కి విన్నవించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పటాన్చెరు పట్టణంలో వ్యాపారస్తులకు, స్థానికులకు నష్టం వాటిల్లకుండా ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరుతూ కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి వినతిపత్రం అందించారు. బిహెచ్ఇఎల్ వద్దా 136 కోట్లతో నూతనంగా నిర్మించిన బీహెచ్ఈఎల్ – లింగంపల్లి నూతన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ నీ ఎమ్మెల్యే జిఎంఆర్ కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి విస్తరణమూలంగా పటాన్‌చెరు పట్టణంలో ఎదురయ్యే ఇబ్బందులను వినతి పత్రంలో కేంద్ర మంత్రికి అందించారు. ప్రధానంగా విస్తరణ మూలంగా పటాన్చెరువు పట్టణంలో వ్యాపార సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన వ్యాపార కేంద్రాలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం విస్తరణ మూలంగా కూల్చివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. సానుకూలంగా స్పందించే సమస్యను పరిష్కరించాలని కోరారు.
జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని ప్రయోగశాల…
పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్…
పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్…
ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : శుక్రవారం జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి…
-లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ -క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి దశ…