భారతి నగర్ డివిజన్‌లో ఘనంగా రంగోలి పోటీలు
పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేసిన కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి
రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :
భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎం.ఐ.జి కాలనీలో ఉన్న బీ పార్క్ మరియు వివేకానంద పార్క్ లలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన రంగోలి పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఏర్పాటు చేయగా, ఆమె ముఖ్య అతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళల సాంస్కృతిక సంప్రదాయాలు, కళా నైపుణ్యాలను ప్రోత్సహించడంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలనే లక్ష్యంతో పార్టీ నాయకత్వం నిరంతరం పనిచేస్తోందని అన్నారు. మహిళల ఐక్యత, సాంస్కృతిక విలువలను కాపాడే కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
రంగోలి పోటీల్లో పాల్గొన్న మహిళలు తమ కళా ప్రతిభతో ఆకట్టుకున్నారు. రంగుల సమన్వయం, సంప్రదాయ నమూనాలు, సందేశాత్మక చిత్రాలతో పార్కులు కళాకాంతులతో మెరిసాయి. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మహిళా సర్కిల్ అధ్యక్షురాలు శ్రీమతి రాణి యాదవ్,రామస్వామి, మాజీ కౌన్సిలర్ నాగమణి, మహిళా బీఆర్‌ఎస్ నాయకులు స్వర్నలత, లక్ష్మి, అనిత, ఫాతిమా, రాధ, సునీత, బేబీ, అరుణ జ్యోతి, పద్మ, విజయలక్ష్మి, నస్రీన్, గాయత్రి, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…