_30 లక్షల రూపాయల సొంత నిధులతో 11 అడుగుల కాంస్య విగ్రహా ఏర్పాటునకు భూమి పూజ
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
తొలి, మలి దశ తెలంగాణ పోరాటాలలో కీలక భూమిక పోషించడంతోపాటు తన పాటలతో తెలంగాణ జాతిని ఏకం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి పక్కన బస్టాండ్ సమీపంలో 30 లక్షల రూపాయల సొంత నిధులచే ఏర్పాటు చేయనున్న 11 అడుగుల కాంస్య విగ్రహ ఏర్పాటునకు శుక్రవారం శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పటాన్చెరులో 11 అడుగుల గద్దర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. సాధారణ బుర్రకథ కళాకారుడుగా ప్రారంభమైన గద్దర్ కళాజీవితం, విప్లవ రాజకీయాలతో మమేకమై, అనంతర కాలంలో తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో ఉన్నతస్థాయికి చేరిందన్నారు. కవిగా గద్దర్ ప్రజా కళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని, వారు లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. తెలంగాణ కోసం తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన గద్దర్ ప్రజాయుద్ధనౌకగా ప్రజల హృదయాల్లో నిలిచారని తెలిపారు. ప్రజలకోసం తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసి ప్రజలకోసమే బతికాడని అన్నారు. అతి త్వరలోనే విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ కార్పొరేటర్ అంజయ్య, దళిత సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…