– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మియాపూర్ కాంగ్రెస్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్
మనవార్తలు ప్రతినిధి – మియాపూర్ :
ఆదివారం రోజు బోనాల పండుగ సందర్భంగా మియాపూర్ స్టాలిన్ నగర్‌లోని ఎల్లమ్మ పోచమ్మ దేవాలయకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాలు, తొట్టెల ఊరేగింపు మహోత్సవం, అలాగే చందానగర్‌లోని పోచమ్మ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవ కార్యక్రమాల్లో మియాపూర్ కాంగ్రెస్ నాయకులు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు , చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు.మియాపూర్ స్టాలిన్ నగర్‌లో నిర్వహించిన బోనాల మహోత్సవానికి టెంపుల్ కమిటీ, అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్ గౌడ్, శంకర్ గౌడ్, నవీన్, పవన్ ఆహ్వానం మేరకు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులు మియాపూర్ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ప్రార్థించారు. మియాపూర్ యువ నాయకులు, స్థానికులు యలమంచి ఉదయ్ కిరణ్ ను శాలువా లతో సత్కరించారు. చందానగర్‌లోని పోచమ్మ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవ కార్యక్రమానికి కట్ల శేఖర్ రెడ్డి స్వామి, శ్రీకాంత్ ల ఆహ్వానం మేరకు యలమంచి ఉదయ్ కిరణ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమాల్లో శరత్, రాధాకృష్ణ, వంశీ, ప్రవీణ్, రత్నాచారి, నాగసాయి, సాయి నిఖిల్, రామ్, భువనేశ్వర్ తదితరులతో పాటు కాలనీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, టెంపుల్ కమిటీ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…