Telangana

ఇంటెలిజెంట్ ఐఓటీ నెట్ వర్క్ ఆప్టిమైజేషన్ పై పరిశోధనకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి యన్నం భరత్ భూషణ్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘ఐఓటీ నెట్ వర్కులలో ఉమ్మడి వనరుల కేటాయింపు, రద్దీ-అవగాహన రౌటింగ్ కోసం హైబ్రిడ్ ఆప్టిమైజేషన్ వ్యూహాలు: మెటాహ్యూరిస్టిక్, క్వాంటం-ఆధారిత ఫ్రేమ్ వర్కులపై ఒక సమగ్ర అధ్యయనం’ చేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.అపర్ణ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సిద్ధాంత వ్యాసం, భారీ-స్థాయి ఐఓటీ వాతావరణాలలో శక్తి సామర్థ్యం, వనరుల కేటాయింపు, కంజెషన్-అవేర్ రౌటింగ్, నెట్ వర్కు పనితీరును మెరుగుపరచడానికి వినూత్న హైబ్రిడ్ ఆప్టిమైజేషన్ నమూనాలను అందిస్తుందని వివరించారు.ఈ పరిశోధన, స్కేలబిలిటీని మెరుగుపరచడానికి, కమ్యూనికేషన్ ఆలస్యాన్ని తగ్గించడానికి, వనరుల నిర్వహణను ఆప్టిమైజ్ చేయడానికి, అధునాతన జీవ-ప్రేరిత మెటాహ్యూరిస్టిక్ అల్గారిథమ్, క్రాస్-లేయర్ ఆప్టిమైజేషన్, ఇంటెలిజెంట్ ఎడ్జ్-ఫాగ్-క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్ వర్కులను ఏకీకృతం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ఐఓటీ ప్రోటోకాల్ లతో పోలిస్తే, శక్తి సామర్థ్యం, లేటెన్సీ, త్రూపుట్, రూటింగ్ స్థిరత్వం, నెట్ వర్కు జీవితకాలంలో గణనీయమైన మెరుగుదల ఉందని సిమ్యులేషన్ ఫలితాలు నిరూపించాయన్నారు.

ఈ పరిశోధన ఫలితాలకు స్మార్ట్ సిటీలు, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక ఐఓటీ, ప్రెసిషన్ అగ్రికల్చర్, పర్యావరణ పర్యవేక్షణ, ఇంటెలిజెంట్ ట్రాన్స్ పోర్టేషన్ సిస్టములలో విస్తృతమైన అనువర్తనాలు ఉన్నాయని తెలిపారు. ఇవి తదుపరి తరం ఐఓటీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తపరిచారు.డాక్టర్ భరత్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర ఎస్.మహబూబ్ బాషా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

6 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago