Telangana

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో నీలి విప్లవం..

_మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట

_ఫిబ్రవరి 15 లోపు నూతన సభ్యత్వాలు పూర్తి చేయండి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నీలి విప్లవం సృష్టించారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మత్స్యకార సహకార సంఘం ప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పాలనలో మత్స్యకారుల అభివృద్ధి జరిగిందని, మత్స్యకారుల ప్రతి ఇంటా నేడు సంతోషాలు నెలకొన్నాయని అన్నారు.

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 38 మత్స్య సహకార సంఘాలు ఉండగా, 1752 మంది మత్స్యకారులు సభ్యత్వ నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మరో 4529 మత్స్యకారులు సభ్యత్వాలు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఈనెల 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సు లోపు గల అభ్యర్థులు, మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలకు హాజరై, సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 15 లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని అధికారులకు, సొసైటీ ప్రతినిధులకు ఎమ్మెల్యే ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతోపాటు, మత్స్య సంపదను పెంచేందుకు వీలుగా ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఉత్పత్తికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మార్కెటింగ్ సదుపాయాల సైతం కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మూలంగా ప్రతి మత్స్యకారులు ఆర్థికంగా అభ్యున్నతి సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.నియోజకవర్గ పరిధిలో మత్స్యకార సోసైటీలకు శాశ్వత ప్రాతిపదికన పక్కా భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.సభ్యత్వ నమోదు పూర్తయిన అనంతరం.. రాష్ట్ర పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా మంత్రి హరీష్ రావులతో కలిసి నియోజకవర్గ స్థాయిలో మత్స్యకారుల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మత్స్యశాఖ అధికారి సతీష్, సహకార సంఘం ప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago