మనవార్తలు ,తెల్లాపూర్
_ విద్యా భారతి పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణం కోసం ఐదు లక్షల విరాళం అందించిన గడీల శ్రీకాంత్ గౌడ్
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తానని పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతుల కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు .సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ, నాగులపల్లి గ్రామంలో విద్యా భారతి పాఠశాలను గతంలో ఆయన పరిశీలించారు. పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణం కోసం గడిల శ్రీకాంత్ గౌడ్ ఐదు లక్షల విరాళం ప్రకటించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తామని ప్రకటనలకే పరిమితమైందని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు.
ఇటీవల తాను పటాన్ చెరువు మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించానని అక్కడ కనీసవసతులు కరువయ్యాయని తెలిపారు. ప్రభుత్వం పేరుకే మన ఊరు, మన బడి కార్యక్రమం అంటూ గొప్పలు చెబుతుందని క్షేత్ర స్థాయిలో మాత్రం ఎలాంటి పనులు చేపట్టలేదన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వం పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేదన్నారు.పాఠశాలలు ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు పుస్తకాలు అందించలేదన్నారు. దీనిని బట్టి విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. డిజిటల్ పాఠాలు కేవలం డిజిటల్ ప్రకటనలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడు శంకర్ ,తెల్లాపూర్ కౌన్సిలర్ శంషాబాద్ రాజు ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, పటాన్ చెరు మండల్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ హనుమంతరావు ,మాజీ బీజేవైఎం జిల్లా నాయకులు రాంబాబు, పటాన్చెరు మండల్ ఓ బి సి అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…