మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పోరేట్ పాఠశాలకు ధీటుగా పోటీ పడి చదవి మంచి ఫలితాలు సాధించాలని బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం చిట్కూల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు .డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదవ తేదీన టీచర్స్ డే జరుపుకుంటున్నామన్నారు .గురువును దైవంగా పూజించే సాంప్రదాయమం మనదని ఆయన గుర్తు చేశారు .
టీచర్స్ డేను పురస్కరించుకుని చిట్కూల్ హైస్కూల్ లోని 24 మంది ఉపాధ్యాయులను, వడ్డెర కాలనీ ప్రైమరీ స్కూల్ లోని 12 మంది ఉపాధ్యాయులను బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ సన్మానించారు. అలాగే పాఠశాలలో చదువుతున్న 300 మంది విద్యార్థులకు గడిల ఫౌండేషన్ ద్వారా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు . పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రతి పేద విద్యార్థుల విద్యుకు సంబంధించి అన్ని రకాల సాయం అందించేందుకు తాను ముందుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య, బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బాబు రాజ్ గౌడ్, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు మదుకర్ రెడ్డి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గడ్డ పుణ్యవతి, మహిళా నాయకురాలు జాన్సీ, మరియు యస్.ఆర్.కే యువసేన సభ్యులు కిషోర్ రెడ్డి, ధన్ రాజ్, సాయి కుమార్,శకిల్, దుర్గా సాయి, దస్తగిరి, జ్ఞానేశ్వర్, రవితేజ, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…