_ప్రారంభించిన బాలీవుడ్ నటి రవీనా టాండన్
_మార్చి 27 నుండి ఏప్రిల్ 10 వరకు 14 రోజుల పాటు ఈ ప్రదర్శన
మనవార్తలు ,హైదరాబాద్:
రంజాన్ పర్వదినం నేపథ్యంలో “దావత్-ఎ-రంజాన్” పేరుతో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా అధ్వర్యంలో మెహిదీపట్నంలోని కింగ్ ప్యాలెస్ లో 14రోజుల పాటు ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రారంభించారు. ఈ నైట్ బజార్ ప్రదర్శన లో పిల్లలు మహిళలతో పాటు అన్ని వయస్సుల వారు ఇష్టపడే ఫ్యాషన్ దుస్తులతో పాటు రంజాన్ పండగకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువుల స్టాల్ల్స్ ఈ ప్రదర్శనలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అనమ్ మీర్జా, ఆమె భర్త క్రికెటర్/లాయర్ అయిన అసదుద్దీన్ మొహద్(భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మొహద్ కుమారుడు)తో కలిసి మూడోసారి ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని అతిపెద్ద ఎక్స్‌పో అయిన దావత్-ఎ-రంజాన్ ఈవెంట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని రవీనా టాండన్ అన్నారు. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం, చాలా రోజుల తర్వాత నేను హైదరాబాద్‌కి వచ్చాను, హైదరాబాద్ బిర్యానీ, హలీమ్ రుచులను ఎంతగానో ప్రేమిస్తానని అన్నారు.ప్రదర్శనలో భాగంగా అనేక రకాల స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ మరియు సరదాతో కూడిన అతిపెద్ద ప్రదర్శనగా ఇది నిలుస్తుందని ఆనం మిర్జా అన్నారు. ఈ నెల ఏప్రిల్ 10 వరకు ఈ వేడుక జరుగుతుందని అన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…