Categories: politics

తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉండండి

_గీతం పట్టభద్రులకు ఐఎస్బీ వ్యవస్థాపక డీన్ సూచన

_ ఘనంగా గీతం 14వ పట్టభద్రుల దినోత్సవం గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్

_పట్టాలు అందుకున్న 1.,141 విద్యార్థులు  

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విద్యార్థులను పెద్ద చేస్తారని, అలాగే అధ్యాపకులు, విద్యావేత్తలని, వారందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలని హెదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ఓ) వ్యవస్థాపక డీన్ ప్రొఫెసర్ ప్రమత్ రాజ్ సిన్హా ఉద్బోధించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో శనివారం నిర్వహించిన 14వ పట్టభద్రుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన స్నాతకోపన్యాసం చేశారు. తరగతి గది లోపల పాఠాల కంటే తరగతి గది వెలుపల పాఠాలు ముఖ్యమైనవి. ఈ పట్టభద్రుల దినోత్సవాన్ని మానసికంగా జ్ఞప్తిపెట్టుకోవాలని విద్యార్థులకు సూచించారు. తన ఐఐటీ కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తన ఉన్నతి కోసం తన తల్లిదండ్రులు ఎంతగా కష్టించారో వారు పోయాకే తెలిపిందన్నారు.

గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ, విద్యార్థులు కెరీర్లో ముందుకు సాగేందుకు తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.పట్టభద్రుల దినోత్సవంలో భాగంగా, తెలంగాణ శాసన మండలి సభ్యుడు, తెలుగు సాహిత్య ఔన్నత్యానికి విశేష కృషిచేసిన ప్రఖ్యాత రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ఇచ్చి సత్కరించారు. ఎంఏ తెలుగు అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణుడైన తనను గీతమ్ గౌరవ డాక్టరేట్తో సత్కరిస్తుందని తెలిసిన తన అమ్మ, మంచి ఔషధాలు రాయమని సలహా ఇచ్చిందని, అటువంటి గ్రామీణ నేపథ్యం తనదన్నారు. గీతనక్కు కృతజ్ఞతలు తెలియజేశారు. యురేనియం అవసరంలేని శక్తిని సృష్టించాలని గీతం విద్యార్థులకు ఆయన సూచించారు. శాస్త్ర విజ్ఞానం ఎంత పెరిగినా సాహిత్యం పాత్ర ఎప్పటికీ తరగదని, కవిత్వం సమాజమంతా బాగుండాలని కోరుకుంటుందన్నారు.

గీతం- హెదరాబాద్ వార్షిక నివేదికను అదనపు ఉపకులపతి (ప్రో వీసీ) ప్రొఫెసర్ డీ.ఎస్.రావు సమర్పించారు. గీతం, హెదరాబాద్ లో ప్రస్తుతం 55 మంది అంతర్జాతీయ విద్యార్థులతో సహా 7,500 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నట్టు చెప్పారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా కెరీర్ను ఎంపిక చేసుకోవడంలో గీతం కెరీర్ గెడైన్స్ కేంద్రం సహాయ పడుతోందని, దాదాపు 180కి పైగా కంపెనీలు గీతమ్ ను సందర్శించి, 700 మందికి పైగా విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు. అత్యధిక వార్షిక వేతనం రూ.18 లక్షలుగా కాగా, మధ్యస్థ జీతం 5.1 లక్షలని, అదే ఎంబీఏ గ్రాడ్యుయేట్ల సగటు జీతం రూ.8 లక్షలని ప్రోనీసీ పేర్కొన్నారు.

గీతం హైదరాబాద్ ప్రాంగణంలో 1,265 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్ వంటి వివిధ విభాగాలలో డిగ్రీలు పొందడానికి అర్హత సాధించగా, 1,141 మంది విద్యార్థులు, 10 మంది పరిశోధకులు వ్యక్తిగతంగా హాజరై పట్టాలను స్వీకరించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన 21 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకున్నారు. గీతం విద్యార్థులు నెత్తికత విషయంలో రాజీపడకుండా సమాజాభివృద్ధికి, దేశ ప్రగతికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి. గుణశేఖరన్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

ఈ 14వ పట్టభద్రుల దినోత్సవంలో గీతం కార్యదర్శి ఎం.భరద్వాజ్, ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం, ప్రోవీసీలు డాక్టర్ గీతాంజలి బత్మనాబానే (మెడికల్ సెన్సైస్), డాక్టర్ కె.గౌతమరావు (క్యాంపస్ లెఫ్ట్); డీన్లు ప్రొఫెసర్ కె.శ్రీకృష్ణ, (సెర్చ్), ప్రొఫెసర్ సి.విజయశేఖర్ (ఇంజనీరింగ్), ప్రొఫెసర్ విభూతి సన్దేవ్ (అర్కిటెక్చర్), సయ్యద్ అక్బరుద్దీన్ (కౌటిల్యా స్చూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ); అమిత్ భద్ర (మేనేజ్ మెంట్); రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీసీ కెమెరాలు ఏర్పాటుతోనే శాంతిభద్రతలు డీసీపీ చింతమనేని శ్రీనివాస్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సిసి కెమెరాలు ఏర్పాటుతో శాంతి భద్రతలు లభిస్తాయని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.…

1 day ago

కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న బిస్లరీ యాజమాన్యం

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి,శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనోహర్ బిస్లరీ కార్మికులకు అండగా జిల్లా కార్మిక వర్గం…

1 day ago

విద్యార్థుల ఆత్మబంధువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారి..438 మంది 10వ తరగతి ప్రతిభావంతులకు సైకిళ్ల పంపిణీ. 35 లక్షల రూపాయల సొంత నిధులతో…

1 day ago

మరోసారి ఉదారతను చాటిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పుట్టిన పిల్లలకు 20వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ముత్తంగిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన…

2 days ago

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పటాన్‌చెరు…

2 days ago

పెండింగ్ లో ఉన్న భూసర్వే సమస్యలు వెంటనే పరిష్కరించాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్ చెరు మండలంలో పెండింగ్ లో ఉన్న భూ సర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలని…

2 days ago