_శాంతి కోసం అణువు : బార్క్ శాస్త్రవేత్తలు
మనవార్తలు,పటాన్‌చెరు:
విద్యుత్ , ఔషధాలు , ఆహారం , వ్యవసాయం , బురద పరిశుభ్రత , స్టెరిలైజేషన్ వంటి రంగాలలో రానున్న కాలంలో పరమాణువును ( అణుశక్తిని ) శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించడం అనేక రెట్లు పెరగబోతోందని . రేడియోకెమిస్ట్రీ – ఐసోటోప్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్.కన్నన్ అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ‘ అనే అంశంపై మార్చి 4-8 వరకు నిర్వహిస్తున్న ఐదురోజుల కార్యశాల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ‘ అణుశక్తి విభాగంపై సింహావలోకనం ‘ అనే అంశంపై ఆయన కీలకోపన్యాసం చేశారు . మనదేశంలో ప్రస్తుతం 6,780 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో 22 అణ విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయని , మరో పది నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు .
అదనంగా , ప్రాథమిక , అనువర్తిత పరిశోధన , రేడియో ఐసోటోప్ ఉత్పత్తి , పదార్థాల పరీక్ష మొదలైన వాటికి ఉపయోగించే ట్రాంబే , కల్పక్కంలో పరిశోధనా రియాక్టర్లు ఉన్నాయన్నారు . ఈ పరిశోధన , పవర్ రియాక్టర్ల నుంచి ఉత్పత్తి చేసిన రేడియో – ఐసోటోప్లు వెద్య ఉత్పత్తుల రేడియేషన్ స్టెరిలెజేషన్ , ఉత్పత్తికి ఉపయోగిస్తున్నట్టు తెలిపారు . రేడియో ఫార్మాస్యూటికల్స్ , న్యూక్లియర్ మెడిసిన్ , క్యాన్సర్ చికిత్సల్లో కూడా వినియోగిస్తున్నా మన్నారు . రేడియో – ఐసోటోప్లు వ్యవసాయంలో మెరుగైన రకాల విత్తనాల ఉత్పత్తికి , సుగంధ ద్రవ్యాలు , ఉల్లిపాయలు , బంగాళదుంపలు , మామిడి వంటి ఆహార పదార్థాల రేడియేషన్ ప్రాసెసింగ్కు కూడా ఉపయోగిస్తున్నట్టు ఆయన వెల్లడిం చారు .
భాభా అణు పరిశోధనా సంస్థ ( బార్క్ ) లో అభివృద్ధి చేసిన రేడియేషన్ టెక్నాలజీలు రేడియోగ్రఫీ , గానూ – రే డెన్సిటో మీటర్లు , రేడియోగ్రఫీ కెమెరాలు , ఫుడ్ రేడియేటర్లు వంటి అనేక పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తున్నట్టు వివరించారు . వర్ధమాన శాస్త్రవేత్తలు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ప్రొఫెసర్ కన్నన్ సందర్భోచిత జవాబులిచ్చారు . ఈ చర్చకు ముందు ఆయన ‘ సినర్జియా ‘ ( సెన్స్డ్ ) క్లబ్ల్ను ప్రారంభించారు . ఇది వినోద కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో సెన్స్డ్ పట్ల నుక్కువను పెంచడానికి దోహదపడుతుందని వ్యవస్థాపక విద్యార్థులు తెలియజేశారు . బార్క్లేని ఎనలిటికల్ కెమిస్ట్రీ విభాగంలో పనిచేసిన డాక్టర్ ఎన్టీఆర్ రెడ్డి ‘ రేడియో కార్యాచరణ , అణు క్షయం ‘ అనే అంశంపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు .
బారికే చెందిన డాక్టర్ సిరాజ్ అహ్మద్ అన్సారీ ఈ కార్యశాల లక్ష్యాలను వివరించడంతో పాటు ఐదు రోజులలో చేయబోయే కార్యకలాపాల గురించి క్లుప్తంగా వివరించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రేడియో ఐసోటోస్ రంగానికి గతంలో తాను అందించిన సేవలను ఈ సందర్భంగా మననం చేసుకున్నారు . ఈ వర్క్షాప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . గీతం , హెదరాబాద్ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాల గురించి రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ వివరించారు . స్కూల్ ఆఫ్ సెర్చ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు స్వాగతోపన్యాసం చేయగా , కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ నరేష్ కుమార్ కటారి వందన సమర్పణ చేశారు . ఈ వర్క్షాప్లో దేశం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 26 మంది ప్రతినిధులు , 80 మంది సెన్స్ విద్యార్థులు పాల్గొంటున్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…