Telangana

వియత్నాంకు విస్తరించిన గీతం అధ్యాపకుడి సేవలు

హోచిమిన్ సిటీలోని వియెన్ డాంగ్ కళాశాలలో రెండు వారాల పాటు ఆతిథ్య ఉపన్యాసాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఇంతవరకు పరిశోధనలు చేపట్టడానికి విదేశాలకు వెళుతున్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఇప్పుడు తమ వృత్తి నైపుణ్యాన్ని విదేశీ విద్యార్థులతో కూడా పంచుకుంటున్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ లోని సీఎస్ఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిరంజన్ అప్పస్వామి కృత్రిమ మేథ (ఏఐ)పై ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు (రెండు వారాల పాటు) ఆతిథ్య ఉపన్యాసాలు ఇవ్వడానికి వియత్నాం హోచిమిన్ సిటీలోని వియెన్ డాంగ్ కళాశాలకు బయలుదేరి వెళ్లారు.అధ్యాపక వృత్తిలో 25 సంవత్సరాల బోధనానుభవం గడించిన డాక్టర్ నిరంజన్ గతంలో నవంబర్ 2022, 2023, రెండు విద్యా సంవత్సరాలలో రెండు వారాల పాటు వియెన్ డాంగ్ కళాశాల విద్యార్థులకు జావా, ఫ్లట్టర్ లో ప్రయోగాత్మక శిక్షణ ఇచ్చారు. విద్యాపరమైన సహకారాన్ని పెంపొందించడం, మెరుగుపరచడంలో ఆయన నిబద్ధత, నైపుణ్యాలు వియత్నాం విద్యార్థులపై నిస్సందేహంగా ప్రభావం చూపాయి.తన బోధనా బాధ్యతలతో పాటు, డాక్టర్ నిరంజన్ సైబర్ సెక్యూరిటీపై చేపట్టిన పరిశోధనా ప్రాజెక్టులో నిమగ్నమై ఉన్నారు. ఈ క్లిష్టమైన రంగంలో జ్జానాన్ని పెంపొందించడంలో తన అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ లో పీహెచ్ డీని కలిగి ఉన్న ఆయన 21 పాఠ్యపుస్తకాలను రచించారు.

ఐ ట్రిపుల్ ఈ సీనియర్ సభ్యునిగా, 2024 ఐ ట్రిపుల్ ఈ కంప్యూటర్ సొసైటీ బెంగళూరు విభాగం కార్యనిర్వాహక సభ్యునిగా డాక్టర్ నిరంజన్ సాంకేతిక పురోగతి, సైబర్ సెక్యూరిటీపై అవగాహనను పెంపొందించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. అదే చాప్టర్ లో సైబర్ సెక్యూరిటీ స్పెషల్ టెక్నికల్ కమ్యూనిటీకి కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు.డాక్టర్ నిరంజన్ బహుముఖ నైపుణ్యాలు విద్యారంగానికి మించి విస్తరించాయి. పోర్ట్రెయిట్, నేచర్ ఫోటోగ్రఫీ అంటే మక్కువ చూపడంతో పాటు బలమైన నెట్ వర్కింగ్ సామర్థ్యాలు, సానుకూలతలు ఆయన బోధన, పరిశోధనా కార్యక్రమాలకు మరింత శోభనిస్తున్నాయి. బహుముఖ ప్రజ్జతో కూడిన ఆయన అభిరుచి అంతర్జాతీయ విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతలకు పరిచయం చేయడమే గాక వారిని అనుసంధానించడానికి కూడా తోడ్పడుతోంది.

 

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago