మనవార్తలు ,పటాన్ చెరు:
బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్న గీతం విద్యార్థులు మరో మెట్టు పెకి ఎక్కేలా ప్రాంగణ నియామకాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి తోడ్పడే ‘ ఐటీ బెల్స్ ‘ పుస్తకాన్ని రచించి , వెలువరించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు . ఖమ్మం జిల్లాకు చెందిన మంకెన ఉదయ్ భాను గీతం విశాఖపట్నం ప్రాంగణంలో 2008-12 మధ్య బీటెక్ సీఎస్ఈ పూర్తిచేసి , ప్రాంగణ నియామకాలల్లో ఎంపికెటీసీఎస్లో చేరినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకనటలో పేర్కొన్నారు . ఆ కంపెనీలో ప్రతిభచాటి ఒక్కోమెట్టూ అధిగమిస్తూ రిక్రూటర్ స్థాయికి చేరిన ఆయన , కలిసొచ్చిన కరోనా లాక్ డౌన్ సమయాన్ని పది మంది తనలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఉపకరించేందుకు పూనుకున్నట్టు తెలియజేశారు .
ప్రస్తుతం అనేక భారతీయ ఐటీ కంపెనీలు జాతీయ అర్హతా పరీక్షలను ( ఎన్యూటీలు ) నిర్వహిస్తూ , బీటెక్ చివరి ఏడాది విద్యార్థులను ఎంపిక చేస్తున్నాయని , అయితే , సరైన మార్గదర్శనం లేక గ్రామీణ విద్యార్థులు ఈ సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నట్టు భాను గ్రహించినట్టు పేర్కొన్నారు . ఈ లోటును పూరించడంలో భాగంగా , తన పదేళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుభవంతో , తనకున్న ఫ్రెషర్ రిక్రూట్మెంట్ నెపుణ్యాలను రంగరించి , ప్రాంగణంలో ఉండగానే ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఐటీ ఉద్యోగం సంపాదించే మార్గదర్శనంతో ‘ ఐటీ బెల్స్’ను వెలువరించినట్టు వివరించారు . ఐటీ పరిశ్రమలో ప్రవేశించాలని అభిలషించే విద్యార్థులకు ఇదో సువర్ణావకాశంగా ఆయన అభిప్రాయపడ్డట్టు తెలిపారు .
విద్యార్థులు ఇంటర్వ్యూ దశకు చేరుకునే వరకు ప్రిపరేషన్ ప్లాన్ను రూపొందించడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుందన్నారు . కానీ , ఇంటర్వ్యూ పూర్తి భిన్నమైనదని , అసలెన ఇంటర్వ్యూ వాతావరణంలో విద్యార్థులను నిమగ్నం చేయడానికి , వాస్తవ ప్రపంచ ఇంటర్వ్యూ వీడియోలు , వీక్లీ ఇండస్ట్రీ హ్యాంగవుట్లు , గ్రూప్ కోచింగ్ సెషన్లు , వ్యక్తిగత మార్గదర్శక ప్రోగ్రామ్ల వంటి వంద శాతం అనుభవపూర్వ అభ్యాసాలతో కూడిన పాఠ్యాంశాలను ఉదయ్ భాను అభివృద్ధి చేసినట్టు ఆ ప్రకటనలో వివరించారు . ఈ పుస్తకం అర్హత ఉన్న ఇంజనీర్లను ఉద్యోగం సాధించగల సత్తా ఉన్న ఇంజనీర్లుగా తీర్చిదిద్దడంలో తోడ్పడగలదనే భరోసాను వెలిబుచ్చారు .
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…