పటాన్ చెరు:
గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో ఈనెల 28 న ( రవారం ) నిర్వహించనున్న 12 వ స్నాతకోత్సవంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నారు . ఈ విషయాన్ని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . గీతం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.శవరావ ఎకృష్ణ అధ్యక్షత జరిగే ఈ స్నారకోత్సవంలో దాదాపు 1300 మంది విద్యార్థులకు పబ్బాలను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు .
కృష్ణ ప్రసాద్ గురించి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పారిశ్రామిక అనుభవం ఉన్న కృష్ణ ప్రసాద్ తన ఇరవయ్యో యేట వ్యవస్థాపక ప్రస్థానాన్ని ప్రారంభించి , 1984 లో విశ్వవ్యాప్త వినియోగదారుల కోసం పారాసెటమాల్ తయారీని ఆరంభించారు . అమెరికాకు వివరాలను ఎగుమతి చేసిన మొదటి భారతీయ కంపెనీలలో ఒకటిగా గ్రాన్యూల్స్ ఇండియాను మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు .
అంటార్కిటా , ఉత్తర ధృవంతో సహా మొత్తం ఏడు ఖండాలలో నిర్వహించిన మారథాన్లలో తన శ్రీమతి ఉమాతో కలిసి ఆయన పాల్గొన్నారు . 2015 లో వారు ఏడు ఖండాలలో ఏడు మారథాలను ఏడు రోజుల్లో నిర్వహించే వరల్డ్ మారథాన్ ఛాలెంజ్ ను పూర్తిచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులను నెలకొల్పారు . ఆరోగ్యం , విద్య , ఉపాధి , మానవ అభివృద్ధి , సంక్షేమ రంగాలలో గ్రామీణ భారత ముఖచిత్రాన్ని మెరుగుపరచడం కోసం కృషిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ స్వర్గ భారత ట్రస్టు హైదరాబాద్ విభాగం అధ్యక్షుడిగా కృష్ణ ప్రసాద్ సేవలందిస్తున్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…