– ఆరెగామీ పేపర్ తో రూపొందించిన పలు బొమ్మలను ప్రదర్శించిన గీతం పూర్వ విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఇప్పటికే 13 గిన్నిస్ రికార్డులు సాధించి, అదే ఓ రికార్డుగా వినుతికెక్కిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరో 11 రికార్డులు లక్ష్యంగా శనివారం భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవలతో కలిసి అంగామీ పేపర్తో రూపొందించిన 6,500 గబ్బిలాలు, 5,500 కార్లు, 3,200 డెనోసార్లు, 1,800 కుక్కలు, 3,600 కప్పలు, 3,100 నెమళ్లు, 2,800 పెంగ్విన్లు, 3,100 పందులు, 4,100 షర్టులు, 6,000 మాప్లే ఆకులతో పాటు 6,200 నిమ్మతొనలను ఒకేచోట ఉంచి, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు. అంగామీ కాగితంలో రూపొందించిన వాటిని తయారు చేయడం ఒక ఎత్తయితే, వాటన్నింటినీ ఒకేచోట ప్రదర్శనగా పెట్టడం మరో ఎత్తు.గీతం గణితశాస్త్ర విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.మల్లిఖార్జునరెడ్డి వాటికి లెక్కించి అధికారికంగా ధ్రువీకరించారు. ఈ పత్రాలను గిన్నిస్ అధికారులకు పంపి, వారి ఆమోదం తరువాత రికార్డును ఖరారు చేయనున్నారు.శివాలీ ఇప్పటికే 13 గిన్నిస్ వరల్డ్ రికార్డులతో పాటు 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులు, నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులను నెలకొల్పిన విషయం విదితమే.తాజాగా లక్ష్యించిన మరో 11 గిన్నిస్ రికార్డులను శివాలీ సాధించాలని గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, బీటెక్ తొలిఏడాది సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అభిలషించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…