మోడీ చిత్రపటానికి పాలాభిషేకం…
– మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్..
పటాన్ చెరు:
కోవిద్ 19 ను అంతమోదించడానికి సామాజిక దూరం పాటించడం ,మాస్క్ ధరించడంతో పాటు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కొల్కురి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు.
అనంతరం నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ… కరోనా నివారణ చర్యల్లో భాగంగా దేశీయ వాక్సిన్ ను పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారందరికీ ఉచితంగా అందిస్తామని మోది ప్రకటనతో దేశవ్యాప్తంగా మోదీ ఫ్లేక్సీలకు, చిత్రపటాలకు పూలాభిషేకాలు మరియు పాలాభిషేకాలు బిజెపి కార్యకర్తలు నిర్వహించారు
జాతినుద్దేశించిన ప్రసంగించిన భారతప్రధాని నరేంద్ర మోదీ గారు దేశప్రజలందరికీ వరాలజల్లులు కురిపించారని తెలిపారు..పద్దెనిమిది సంవత్సరాలు నిండిని భారతపౌలందరికీ జూన్ 21 నుండి ఉచితంగా కోవిడ్ టీకాలు అందిస్తామని అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రకటించారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు.ప్రవేటు ఆసుపత్రులకు ఇరవైదు శాతం టీకాలు అందిస్తామని..అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పధకం నవంబర్ (దీపావళి) వరకు పొడిగిస్తు ఎనభైకోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు… నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజసంక్షేమం కోసం కట్టుబడి ఉందని, మోది ప్రభుత్వం కరోనాతో, శత్రుదేశాలతో యుద్ధం చేస్తుంటే ప్రతిపక్షాలు మోదితో యుద్ధం చేస్తున్నారని జగదీశ్వర్ గౌడ్ విమర్షించారు.టీకాల విషయంలో ప్రతిపక్షాల పుకార్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. ప్రజలంతా మోదికి అండగా ఉన్నారని తెలిపారు.. డిసెంబర్ నాటికి ప్రతి భారతీయుడికి టీకా ఖచ్చితంగా అందుతుందని కరోనా జయించడంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు కొల్కురి రాజశేఖర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు, ఆశిష్ గౌడ్ బీజేవైఎం రాష్ట్ర ఉప అధ్యక్షుడు, శ్రీనివాస్ గుప్తా, సుజాత, మురళీధర్ వర్మ, అంతం గౌడ్, జగన్ రెడ్డి, అంగడి బాలరాజు, రాజు గౌడ్ బిజెపి కార్యకర్తలు, మోది అభిమానులు పాల్గొన్నరు..
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…