Telangana

విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన

నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఎంతో అవసరమని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో పటాన్ చెరు ప్రైవేట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రైవేట్ పాఠశాలల క్రీడా పోటీలను ఎమ్మెల్యే జిఎంఆర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందిస్తే మానసిక వికాసం, శారీరక ధారుడ్యం లభిస్తుందని తెలిపారు. ర్యాంకుల మాయలో పడి క్రీడలను నిర్లక్ష్యం చేయవద్దని పాఠశాల యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.పటాన్ చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందించడంతో పాటు ఆధునిక వసతులతో స్టేడియాలు అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, TRSMA రాష్ట్ర కోశాధికారి రాఘవేంద్ర రెడ్డి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు సాయి తేజ, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఎస్సై మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో అంతర్జాతీయ సదస్సు

జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని ప్రయోగశాల…

1 week ago

జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో విశిష్ట వక్తగా గీతం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్…

1 week ago

రాష్ట్ర, జాతీయ క్రీడలకు చిరునామా పటాన్ చెరు _ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్…

2 weeks ago

మహిళా విద్యకు మార్గదర్శకుడు ఫూలే : నీలం మధు ముదిరాజ్

ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : శుక్రవారం జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి…

2 weeks ago

పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన అంతర్ జిల్లా రాష్ట్రస్థాయి కోకో క్రీడోత్సవాలు

-లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ -క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి దశ…

2 weeks ago

బిస్లరి లో చట్ట విరుద్ధంగా తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలి

బిస్లరీ కార్మికులకు శాండ్విక్, పార్లే యూనియన్లు సంపూర్ణ మద్దతు న్యాయం జరిగే వరకు కార్మికులు ఐక్యంగా పోరాడాలి సిఐటియు జిల్లా…

2 weeks ago