Telangana

సామాజిక సేవలో అందరు భాగస్వాములు అవ్వాలి పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి

_పేదలకు అందుబాటులో వైద్యం
అమేధ హాస్పిటల్స్ డైరెక్టర్ రాజేంద్ర

_బడుగు జీవులకు ఖరీదైన వైద్యం
సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య
సామాజిక సేవలు విస్తరిస్తాం

_మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) కన్వీనర్,కో కన్వీనర్ అర్జున్,అబ్దుల్ బాసిత్

అమేధ హాస్పిటల్స్ సౌజన్యంతో,మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒకరకంగా సామాజిక సేవలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి ఉంటుందని పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక్ భవన్ లో అమేధ హాస్పిటల్స్  సౌజన్యంతో మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
ను నిర్వహించారు. ఈ సందర్భంగా అమేధ హాస్పిటల్స్ యజమాన్యం వందమందికి పైగా పలు రకాల వైద్య సేవల తోపాటు ఉచిత మందులు, టెస్టులు నిర్వహించారు. అవసరమైన వారికి హాస్పిటల్ కి రెఫర్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతు పట్టణ ప్రాంతాలలో కొంతమేర వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ రూరల్ ఏరియాలో అవగాహన లేమితో ప్రజలు ఫ్రీ డయాబెటిక్, డయాబెటిక్ వంటి రోగాల బారిన పడుతు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయటంతో పాటు వారిలో అవగాహన తో పాటు చైతన్య పరచలాని సూచించారు.

అమేధ హాస్పిటల్స్ డైరెక్టర్ రాజేంద్ర మాట్లాడుతు పటాన్ చెరు పట్టణంలో హాస్పిటల్ పెట్టిన రోజు నుంచి కార్మికులు,పేద, మధ్యతరగతి వాళ్లకు కమర్షియల్ ఆలోచన తో కాకుండా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ముందు కూడా సామాజిక సేవ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతామని గ్రామాలలో అందరి సహాయ సహకారాలతో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎంవికే ఫౌండర్ రాజయ్య మాట్లాడుతు ప్రైవేటు హాస్పిటల్ వైద్యం అంటేనే ఖరీదైనదిగా భావిస్తున్న ఈ రోజుల్లో అన్ని సదుపాయాలతో 24 గంటలు వైద్య సేవలు అందిస్తూ అట్టడుగు బడుగు జీవులలో వెలుగు నింపుతున్న అమేధ హాస్పిటల్స్ యజమాన్యాన్ని అభినందించారు.మంజీరా విజ్ఞాన్ కేంద్రం (ఎంవికె) కన్వీనర్,కో కన్వీనర్ అర్జున్,అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ మా సంస్థ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధనంజయ్,రాజశేఖర్, చిరంజీవి, సిఐటియు నాయకులు వాజిద్ అలీ, పాండురంగారెడ్డి నాగేశ్వరరావు, అర్జున్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago